English-Tense for the Telugu

 

Tenses
(కాలములు)




          Tense అనగా "కాలం"(time) అని అర్థం. ఇది క్రియ(verb) యొక్క రూపం. అంటే క్రియా రూపాన్ని (verb form) తెలియజేసే దానిని "Tense" అని అంటారు. ఇంగ్లీషులో ముక్యంగా 3 రకాల Tenses ఉన్నాయి. అవి:

1. Present tense (వర్తమాన కాలము)
2. Past tense (భూత కాలము)
3. Future tense (భవిష్యత్ కాలము)

పై మూడు Tense లను ఒక్కోదానిని మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. అంటే మొత్తం 12 రకాలు, వాటిని ఒక్కొక్కటిగా క్రింద తెలుసుకుందాం.


1. Simple Present Tense:

          అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను, రోజువారీ చేసే పనులను తెలియజేయడానికి "Simple Present Tense" ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+V1

Eg:

1. I speak Telugu .
2. Raju drinks tea.
3.We eat rice daily.
4.They go to church every Sunday.

Note:     Subject he, she, it లలో ఉన్నపుడు verb కు  s  గానీ  es  గానీ  ies  గానీ చేర్చాలి.

verb ch, sh, s, o, x లతో ముగిస్తే "es" ను, y తో ముగిస్తే "ies" ను, ఒకవేళ ముందు చెప్పిన అక్షరాలతో verb ముగియకపోతే "s" ను verb కు చేర్చాలి.

2. Present Continuous Tense:

మనం చూస్తూ ఉన్న సమయంలో గానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో గానీ(ఏదైనా చేస్తున్న సమయంలో ), జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి "Present Continuous Tense" ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+am/is/are+v4

Eg:

1. I am going to temple.
2. She is watching movie.
3. Look, they are reading books.
4. You are teaching grammar.

Note:      ఈ tense లో am/is/are అనే helping verbs కలవు, I వచ్చినపుడు am ను, we/you/they వచ్చినపుడు are ను, he/she/it వచ్చినపుడు is ను ఉపయోగించాలి.

3. Present Perfect Tense:

కొంతసేపటి క్రితంగాని, కొంతకాలం క్రితంగాని ప్రారంభించి పూర్తి చేసిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+have/has+V3

Eg:

1. I have just taken dinner.
2. She has watched movie just now.
3. They have gone to temple.
4. Dog has already drunk milk.

Note:      I, We, You, They లు వచ్చినపుడు "have" అనే helping verb ను ఉపయోగిస్తారు, He, She, It లు వచ్చినపుడు "has" అనే helping verb ను ఉపయోగించాలి.

4. Present Perfect Continuous Tense:

గతంలో ఎప్పుడో మొదలై ఇప్పటివరకు జరిగి ఇకముందు కూడా జరగడానికి అవకాశం ఉన్న పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+have/has+been+v4

Eg:

1. They have been working on this project since 2007.
2. She has been doing this work from 2016.



5. Simple Past Tense:

గతంలో ప్రారంభించి గతములోనే  పూర్తిచేయబడిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+V2

Eg:

1. I Watched Dhee-3 last night.
2. We played chess  yesterday.

6. Past Continuous Tense:

గతంలో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉన్నపుడు  మరొక పని జరిగిందని లేదా ఒక పని జరిగినపుడు మరొక పని జరుగుతూ ఉందని  తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+was/were+v4

Note:      We, You, They subject లకు were అనే helping verb ను మరియు I, He, She, It subject లకు was అనే helping verb ను ఉపయోగించాలి.

Eg:

1. I was watching T.V. when you called me last night.
2. We were playing football when you reached home.

7. Past Perfect Tense:

గతంలో ఒక నిర్దిష్ట సమయంకన్నా(మరొక పనికి) ముందే జరిగిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+had+V3

Eg:

1. I had gone to bed by 10 pm/before I called her.
2. She had published her book before I wrote mine.

8. Past Perfect Continuous Tense:

గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన ఒక పని ఒక సమయం నుండి మరొక సమయం వరకూ కొనసాగి తరువాత కూడా కొనసాగటానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+had+been+v4

Eg:

1. They had been writing exam when I went there.
2. He had been singing since I was a kid.



9. Simple Future Tense:

భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+shall/will+V1

Eg:

1. I shall purchase a phone tomorrow.
2. We shall consult a doctor next year.

I, We subject లకు "shall" అనే helping verb ను, మిగిలిన subject లకు "will" అనే helping verb ను ఉపయోగించాలి.

10. Future Continuous Tense:

భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.

Structure:      Subject+shall/will+be+v4

Eg:

1. I will be watching a film at this time tomorrow.
2. She will be visiting Delhi next year.

11. Future Perfect Tense:

భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడే పనులను ఈ tense ద్వారా చెపుతారు.

Structure:      Subject+will/shall+have+V3

Eg:

1. They will have done this work by tomorrow.
2. He will have slept here by this time next week.



12. Future Perfect Continuous Tense:

భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకూ కొనసాగి తరువాత కూడా కొనసాగే పనులను ఈ tense లో తెలియజేస్తారు.

Structure:      Subject+will/shall+have+been+v4

Eg:

1. He will have been doing that work tomorrow.
2. She will have been designing a car tomorrow.

Comments

Popular posts from this blog

R-22-jntuh-English for Skill Enhancement - semester model question paper

Unit -III ESSAY -LESSONS FROM ONLINE LEARNING

Assignment -I &II